లగడపాటి రాజగోపాల్ పరువు తీశాడా?

కాంగ్రెసులోని తెలంగాణ నాయకులు మాత్రం ఆయనపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. దొంగలా పారిపోయి వచ్చాడని, పార్టీ పరువు తీశాడని వారు అభిప్రాయపడ్డారు. హైదరాబాదుకు రావడం ద్వారా తెలంగాణలో ఉద్రిక్తతలు పెంచడమే లగడపాటి లక్ష్యమని, అంతకు మించిన ప్రయోజనం ఏమీ లేదని వారంటున్నారు. నిమ్స్ లోకి పరుగెత్తుతూ వచ్చిన తీరు హుందాగా, గౌరవప్రదంగా లేదని అంటున్నారు. అది బాధ్యతాయుతమైన చర్య కాదని అంటున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం కాంగ్రెసు వర్గాలకు కూడా నచ్చలేదు. లగడపాటి రాజగోపాల్ తో పోలీసులు కమ్మక్కయి హైదరాబాదుకు వచ్చారని ఆయన అన్నారు. ఆయన హైదరాబాదుకు వచ్చిన తీరు కూడా ఏమంత కష్టసాధ్యమైన విషయంగా కనిపించలేదు. అంతటా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పిన పోలీసు అధికారులు నిజంగానే లగడపాటిని గుర్తించి పట్టుకోలేకపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే రాజగోపాల్ కు సేఫ్ ప్యాసేజ్ కల్పించారని అందరూ అనుకుంటున్న మాట.
సాధారణంగా నిమ్స్ వెనక గేటు మూసి ఉంటుంది. అయితే లగడపాటి రాకకోసమే ఆ గేటును సోమవారం తెరిచారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన వెనక గేటు నుంచి వచ్చి నిమ్స్ లోకి పరుగెత్తిన తీరు కూడా అంత హుందాగా లేదని అంటున్నారు. నిరాహార దీక్షను, ఆందోళనను ఆయన సీరియస్ వ్యవహారంగా తీసుకోలేదనే వాదన కూడా ఉంది. ఆయన నేరుగా నిమ్స్ లోకి వెళ్లి అప్పటికే సిద్ధం చేసి ఉంచిన పడకపై ఎగరి గంతేసి ఎక్కి పడుకున్నారు. అంతా ముందే రచించుకుని అమలు చేసిన పథకంలా లగడపాటి రాజగోపాల్ వ్యవహరించిన తీరు తెలియజేస్తోంది.












Click it and Unblock the Notifications