హైదరాబాద్: రాష్ట్రంలో తలెత్తిన సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. కేంద్రం త్వరలోనే సమస్యను పరిష్కరిస్తుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన చెప్పారు.
రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ మంగళవారం ఉదయం రోశయ్యతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వారి మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు జరిగినట్లు సమాచారం.