న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిణామాలపై చర్చించడానికి ఈరోజు జరిగిన కోర్ కమిటీ సమావేశం ముగిసింది. మరి కాసేపట్లో హోంశాఖ అధికారిక ప్రకటన చేయనుంది. ఆ ప్రకటన సమైక్యాంధ్ర దిశగా ఉంటుందని రాయలసీమ నాయకుడు టిజి వెంకటేష్ అంటున్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరేవరకు అందరూ సంయమనం పాటించాలని కేంద్రం కోరింది. రాష్ట్ర పరిణామాలపై కాంగ్రెస్ కోర్ కమిటి సమావేశం ముగిసింది. ఏకాభిప్రాయం కుదిరిన తరువాతే ఒక ప్రకటన చేయాలని కమిటి నిర్ణయించింది. ఏకపక్షంగా ప్రకటన చేయకూడదని కూడా కమిటి నిర్ణయించింది.
ఏకాభిప్రాయం కోసం మరింత చర్చ జరగవలసి ఉందని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. అయితే కమిటీ వేయడానికి సోనియా గాంధీ అంగీకరించలేదని తెలుస్తోంది.