త్వరలో రాష్ట్ర విభజనపై ప్రణబ్ ముఖర్జీ ప్రకటన

ఈ సమావేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారలపైనే చర్చించారు. అన్ని ప్రాంతాల వారికి ఆమోద యోగ్యంగా ఉండే విధంగా ఈ సమావేశంలో ఒక ముసాయిదా ప్రకటన రూపొందించారు. ఆ ముసాయిదాని సోనియా గాంధీకి చూపించి, ఆమె ఆమోదం పొందిన తరువాత సాయంత్రానికి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ ముసాయిదా ప్రకటనలో సోనియా గాంధీ మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉంది.ముసాయిదా ప్రకటనను చూపించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులు సోనియా నివాసానికి వెళ్లారు.












Click it and Unblock the Notifications