టిడిపి నేతలపై ఓయు విద్యార్థుల దాడి

Telugudesam
హైదరాబాద్: సంఘీభావం తెలపడానికి వచ్చిన తెలుగుదేశం శాసనసభ్యులపై హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు దాడి చేశారు. గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. సంఘీభావం తెలపడానికి తెలుగుదేశం శాసనసభ్యులు నాగం జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర రావు వచ్చారు. తెలంగాణపై టిడిపి వైఖరి స్పష్టం చేయాలంటూ వారు తెలుగుదేశం నాయకులపై దాడి చేశారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. టిడిపి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ దాడిలో నాగం జనార్దన్ రెడ్డి స్పృహ తప్పారు.

చెప్పులతో కొడుతూ వారిని వెంటాడారు. నాగం జనార్దన్ రెడ్డిని చుట్టుముట్టి కొట్టారు. గాయాల పాలైన ఆయనను మోటార్ సైకిలుపై ఆస్పత్రికి తరలించారు. మిగతా నేతలను పోలీసులు సురక్షితంగా బయటకు తరలించారు. విద్యార్థుల దాడిలో శాసనసభ్యులకు చెందిన ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ చర్యను తెలుగుదేశం శాననసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఖండించారు. తమపై జరిగిన దుష్ప్రచారం వల్లనే ఈ సంఘటన జరిగిందని తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+