కొత్త గవర్నర్ మాజీ పోలీసు బాస్ నరసింహన్?

Narasimhan
న్యూఢిల్లీ- హైదరాబాద్: తివారీ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జార్ఖండ్‌ గవర్నర్‌ శంకర్‌ నారాయణ్‌, ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ నరసింహన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. నరసింహన్‌ తమిళనాడుకు చెందిన మాజీ అధికారి. శంకర్‌ నారాయణ్‌ కేరళకు చెందిన రాజకీయ నాయకుడు. వీరిలో... నరసింహన్‌కే బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది.

నరసింహన్ ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఇప్పుడు అదే రాష్ట్రానికి గవర్నర్‌గా పంపడం సమంజసమేనా.. అనే కోణంలో చర్చ జరిగింది. అయితే... ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలు బాగా తెలిసి ఉండటం, ఐబీలో పనిచేసిన అనుభవం ఉండటంతో ఆయననే గవర్నర్‌గా నియమించడం సముచితంగా ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. శంకర్‌ నారాయణ్‌ నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు.

ఆయన సేవలను వినియోగించుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. గతవారం నరసింహన్‌ కేంద్ర మంత్రులు చిదంబరం, జైపాల్‌ రెడ్డిలతో మంతనాలు జరిపారు. తివారీ రాజీనామాను ఆమోదించినట్లు, మరో గవర్నర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆదివారం మధ్యాహ్నంలోపు రాష్ట్రపతి భవన్‌ నుంచి ప్రకటన వెలువడుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

నరసింహన్‌ పూర్తి పేరు ఎక్కడు శ్రీనివాసన్‌ లక్ష్మీనరసింహన్‌. భార్యపేరు విమలా నరసింహన్‌. ఆయన జనవరి 25, 2007న గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. మద్రాస్‌ యూనివర్సిటీలో ఎం.ఎ. ఎల్‌ఎల్‌బీ (గోల్డ్‌ మెడల్‌) పూర్తిచేసిన నరసింహన్‌ 1968లో ఇండియన్‌ పోలీస్‌ సర్వీసెస్‌లో ప్రవేశించారు. మన రాష్ట్ర కేడర్‌కే చెందిన నరసింహన్‌ ఇంతకుముందు ఛత్తీస్‌గఢ్‌ డీజీపీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆయన కొన్నాళ్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కూడా తన సేవలందించారు. 1981-84 మధ్య కాలంలో రష్యాలో భారతరాయబారిగా పని చేశారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో స్పెషల్‌ డైరెక్టర్‌గా పని చేసిన నరసింహన్‌ ఆ తరువాత ఐబీ చీఫ్‌గా పదోన్నతి పొందారు. డిసెంబర్‌ 31, 2006వరకు అదే స్థానంలో కొనసాగిన నరసింహన్‌ జనవరి 25,2007 న ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+