గవర్నర్ తో భేటీకి ప్రత్యేకత లేదు: డి శ్రీనివాస్

D Srinivas
హైదరాబాద్: తాను గవర్నర్ నరసింహన్ ను కలవడంలో ప్రత్యేకత ఏమీ లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. ఆయన బుధవారం ఉదయం గవర్నర్ ను కలిశారు. తాను నరసింహన్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆయన భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. నూతన గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నరసింహన్ ను ఆయన అభినందించారు.

గవర్నర్ తో తాను ప్రత్యేకంగా ఏ విషయంపై కూడా చర్చించలేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని తాజా పరిమాణాలపై వివరించినట్లు ఆయన తెలిపారు. గొత్త గవర్నర్ నరసింహన్ ను కలవడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు వరుస కడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక వైపు, సమైక్యాంధ్ర కోసం మరో వైపు ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యం ఉన్నట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+