హైదరాబాద్ లో జెఎసి నేతల అరెస్టు

జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదం రామ్ తో పాటు తెలుగుదేశం నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, టి. దేవేందర్ గౌడ్, ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమతి నాయకులతో పాటు పలువు ప్రజా సంఘాల నాయకులు అరెస్టయినవారిలో ఉన్నారు. తెలంగాణ బంద్ ను ప్రశాంతంగా నిర్వహించాలని జెఎసి కన్వీనర్ కోదండరామ్ ప్రజలను కోరారు. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ పై ఒత్తిడి తేనున్నట్లు మందకృష్ణ మాదిగ చెప్పారు. రాజకీయ నాయకులు రాజీనామాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రత్యక్ష ఆందోళనలోకి రావాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications