అవసరమైతే మరోసారి నేను చస్తా: కె చంద్రశేఖర రావు

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ కోసం అవసరమైతే మరోసారి తాను చస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. గాంధీ ఆస్పత్రిలో విద్యార్థులతో ఆయన బుధవారం ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేశారు. గాంధీ ఆస్పత్రి వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న వైద్య విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టవద్దని ఆయన కోరారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో వందల మంది విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారని, వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు ప్రాణ త్యాగానికి పాల్పడవద్దని, అవసరమైతే తాను ప్రాణాలు ఇస్తానని ఆయన అన్నారు.

కాళ్లు మొక్కినా విద్యార్థులు దీక్ష విరమించడానికి సిద్ధపడడం లేదని, ఉస్మానియా జెఎసి జోక్యం చేసుకుని విద్యార్థులతో దీక్షలు విరమింపజేయాలని కోరుతున్నానని ఆయన చెప్పారు. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న విద్యార్థుల శిబిరాలు తొలగిస్తూ, పోలీసులు దౌర్జన్యాలకు దిగుతుంటే శాంతి ఎలా ఏర్పడుతుందని, టీవీల ద్వారా ముఖ్యమంత్రి కె. రోశయ్య శాంతి మంత్రం వల్లిస్తే సరిపోదని ఆయన అన్నారు. ఆస్పత్రుల్లో చేర్చిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మంత్రులను, ఉన్నతాధికారులను పంపి వారి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ అంతటా బుధవారం శాంతియుతంగా బంద్ పాటించారని ఆయన చెప్పారు. ఒక్క ప్రాణం పోయినా తెలంగాణ భగ్గుమంటుందని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+