కర్నూలు ప్రజారాజ్యం ఆఫీసు ఖాళీ!

అయితే మూడు నెలల క్రితం అంత బాడుగను భరించలేము, 10నుంచి 12వేల రూపాయల్లో బాడుగ ఉండే విధంగా కార్యాలయాన్ని చూడాలని రాష్ట్ర పార్టీ ముఖ్యులు జిల్లా నేతలకు తెలియజెప్పినట్లు తెలిసింది. తరుచూ ఆఫీసులు ఎందుకు మార్చాలనే భావనతో మిగతా మొత్తాన్ని పార్టీ జిల్లా నేతలు భరించుకునే విధంగా నిర్ణయించుకున్నారు. అయితే గత మూడు నెలల కాలంలో అద్దెల కోసం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి చిల్లి గవ్వ కూడా అందలేదని సమాచారం.
జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి పీఆర్పీ తరఫున ఎన్నికయ్యారు. పలు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. పీఆర్పీ జిల్లా కన్వీనర్ భూమానాగిరెడ్డి తనదైన శైలిలో పార్టీ కార్యక్రమాలు నడిపించేందుకు ఎన్నికల సమయంలో ప్రయత్నించారు. ఆ పార్టీ రాష్ట్ర ఆధ్యక్షుడు, సినీ నటుడు చిరంజీవి జిల్లా పర్యటన కార్యక్రమాలను కూడా విజయవంతం చేయడంలో భూమా, ఆయన మద్దతుదారులు కీలకంగా వ్యవహరించారు.
అయితే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఇటు చిరంజీవి, అటు భూమా ఆశలు నెరవేరలేదు. దీంతో భూమా, ఆయన మద్దతుదారులు కూడా నిరుత్సాహంతో ఉన్నారు. వారికి కాంగ్రెస్ గాలం వేస్తుండగా, వారు కూడా అధికార పార్టీలో చేరేందుకు సుముఖంగానే ఉన్నారు. ఈ పరిస్థితిలో పీఆర్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు చిరంజీవి ఇతర ఆ పార్టీ నాయకులు అయోమయంలో పడటంతో జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలపై శ్రద్ధ చూపలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి.












Click it and Unblock the Notifications