డబ్బు ఇవ్వలేదని ప్రియురాలిపై హత్యాయత్నం

కొంతకాలంగా గోవిందు తనను డబ్బుల కోసం వేధిస్తున్నాడని, కూలి పనికి వెళ్లి సంపాదిస్తున్న డబ్బు కూడా బలవంతంగా తీసుకుంటున్నాడని మహిళ తన వాంగ్మూలంలో పేర్కొంది. డబ్బులివ్వలేదనే కోపంతో సోమవారం అర్థరాత్రి గోవిందు కిరోసిన్ పోసి నిప్పంటించి తనను హతమార్చే ప్రయత్నం చేశాడని ఆమె పేర్కొంది. తీవ్రగాయాల పాలైన ఆమెను స్థానికులు 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలం మేరకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి అవుట్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి కడియం స్టేషన్‌కు బదిలీ చేశారు. కడియం ఎస్సై కె.శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications