తెలంగాణలో బంద్ ప్రభావం ఎక్కువే

ఖమ్మ జిల్లాలోని మధిరలో మహిళలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 165 రైళ్లను రద్దు చేశారు. వరంగల్ జిల్లాలో ఆందోళనకారులు సంపర్క్, మిలీనియం ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపేశారు. నిజామాబాద్ లో ఉదయం ఐదున్నర గంటల నుంచే ఆందోళనకారులు ర్యాలీలు ప్రారంభించారు. వరంగల్ జిల్లా జనగామ జైలులో ఖైదీలు నిరాహార దీక్షలు చేపట్టారు. మెదక్ జిల్లా జోగిపేటలో ఆందోళనకారులు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 3800 బస్సులు, మిగతా 8 తెలంగాణ జిల్లాల్లో 5200 బస్సులు నిలిచిపోయాయి. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. తెలంగాణ అంతటా ప్రజాజీవనం స్తంభించింది. విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.












Click it and Unblock the Notifications