తెలంగాణపై వైయస్ ప్రకటనే శిరోధార్యం: లగడపాటి రాజగోపాల్

ప్రత్యేక తెలంగాణకు సంబంధించి వైయస్ ఏర్పాటు చేసిన కమిటీని పునరుద్ధరించాలని ఆయన కోరారు. తెలంగాణ సమస్యను రాష్ట్రమే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. సమస్య పరిష్కారానికి ఇప్పుడే కేంద్రం జోక్యం చేసుకోకూడదని ఆయన అన్నారు. రాష్ట్రం పరిష్కారం చేసుకోలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య అధ్యక్షతన వైయస్ రాజేశేఖర రెడ్డి తెలంగాణపై ఒక కమిటీ వేశారు. అయితే ఈ కమిటీలో చేరడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇష్టపడలేదు. ఆ కమిటీని పునరుద్ధరిస్తామని రోశయ్య చెప్పారు. అయితే రాజకీయ పార్టీలు అందుకు అంగీకరించలేదు.












Click it and Unblock the Notifications