తెలంగాణ వాదనలు అబద్ధం: ఉండవల్లి అరుణ్ కుమార్

Undavalli Arun Kumar
హైదరాబాద్: తెలంగాణవాదులు చేస్తున్న వాదనలను కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పు పట్టారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ఓ లేఖ రాశారు. ప్రాంతాలవారీగా జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధిపైనే కాకుండా ఇతర విషయాలపై కూడా వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కన్నా తెలంగాణ ప్రాంతమే ఎక్కువ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. కోస్తావారి జలదోపిడీ వల్లనే తెలంగాణ వెనకబడిందనే ప్రచారాన్ని వరుస ప్రభుత్వాలు తిప్పికొట్టలేకపోయాయని ఆయన అన్నారు.

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందనే ప్రచారాన్ని వరుస ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే ప్రస్తుతం ఈ స్థితి వచ్చిందని ఆయన అన్నారు. మూడింట రెండింతల మెజారిటీతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల విలీనం జరిగిందని ఆయన చెప్పారు. రెండు ప్రాంతాల విలీనాన్ని ఫజల్ అలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్సార్సీ) కూడా వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. మంత్రివర్గంలో తెలంగాణవారికి భారీ ప్రాతినిధ్యం లేకుండా ఎప్పుడు లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+