తెలంగాణ విద్యార్ధుల ప్రసంగాలతో కృష్ణాలో ఆవేశం

Krishna Dist
విజయవాడ: సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు సోమవారం సీమాంధ్రలో జరిగే బంద్‌ విజయవంతం చేయడానికి రంగం సిద్ధమైంది. బంద్‌ సంపూర్ణంగా, స్వచ్ఛందంగా నిర్వహించాలని నేతలు భావిస్తున్నారు. తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఇది డబ్బు సంచుల నుంచి వచ్చినది కాదని, ప్రజల గుండెచప్పుడు నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమమని నిరూపించడానికి ఈ బంద్‌ను విజయవంతం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ నిర్ణయాలను ప్రచారం చేశారు.

ఈ నేపథ్యంలో వ్యాపార వాణిజ్య కేంద్రాలను స్వచ్ఛందంగా మూసివేయడానికి చాంబర్‌ ముందుకు వచ్చింది. మరోవైపు విద్యాసంస్థలు కూడా సెలవు ప్రకటించాయి. సోమవారం నుంచి అర్ధ సంవత్సర పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండటంతో మొదటిరోజు పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించాయి. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కళాశాలలకు వెళ్లి విద్యాసంస్థలను మూసివేయాలని కోరారు. కార్పొరేట్‌ కళాశాలలతో మాట్లాడి వాటిని మూయించే బాధ్యత ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్‌కు అప్పగించారు. ఉద్యోగులు కూడా మద్దతు ప్రకటించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. బంద్‌ సందర్భంగా ముందస్తు జాగ్రత్తగా ఆర్టీసీ జిల్లాలోని 1,350 బస్సు సర్వీసులను అర్ధరాత్రి నుంచి నిలిపివేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ నుంచి రావాల్సిన బస్సులను అక్కడే నిలిపివేస్తున్నారు.

తెలంగాణ విద్యార్థి గర్జనలో ఆంధ్ర ప్రాంత ప్రజలను అవహేళన చేస్తూ మాట్లాడటం ఇక్కడి జేఏసీలో పట్టుదల పెరిగింది. బంద్‌ సంపూర్ణంగా నిర్వహించడం ద్వారా సత్తాను నిరూపించడానికి నేతలు, విద్యార్థులు సన్నద్ధమయ్యారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం, ప్రజారాజ్యంతో పాటు ఇతర పార్టీల మద్దతు కూడా ఉండటంతో బంద్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లను స్టేషన్‌కు పిలిపించి ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఐదో తేదీన రైల్‌రోకోకు తెలంగాణా జేఏసీ కూడా పిలుపునివ్వడంతో ఆంధ్రాలో రైళ్ల రాకపోకలను నిలిపివేయడం, దారిమళ్లించడానికి గల అవకాశాలను రైల్వే అధికారులు చర్చిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+