సీమాంధ్రల్లో కొనసాగుతున్న బంద్

Bandh
విజయవాడ: సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం రాయలసీమ, కోస్తాంధ్రల్లో సోమవారం బంద్ జరుగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచే వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపేశారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వాణిజ్య సంస్థలను మూసిశారు. నెల్లూరు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. తిరుపతి, విజయవాడ చెన్నై ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపేశారు. తెలంగాణకు వెళ్లే బస్సులను కూడా నిలిపేశారు. బంద్ సందర్భంగా విశాఖపట్నంలో సభలు, ప్రదర్శనలు, ర్యాలీలను నిషేధించారు.

విజయవాడలో ధర్నాకు దిగిన మేయర్ రత్నబిందు, మాజీ మేయర్ మల్లికా బేగంలను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాలో ఆందోళనకు దిగిన ప్రజారాజ్యం కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ బస్ డిపో వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు ధర్నాకు దిగారు. కర్నూలులో విద్యాలయాలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అన్ని జిల్లాల్లో ఎక్కడి ఆర్టీసి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. శ్రీకాకుళంలో ఆర్టీసి బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+