చంద్రబాబుకు ఢిల్లీ ప్రతినిధుల బొప్పి

సీమాంధ్ర ప్రతినిధిగా యనమల రామకృష్ణుడిని, తెలంగాణ ప్రతినిధిగా నాగం జనార్దన్ రెడ్డిని పంపుతారనే వార్తలు వచ్చాయి. కానీ జనార్దన్ రెడ్డి అందుకు సముఖంగా లేనట్లు తెలుస్తోంది. పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉంటుందని చెప్పవలసి వస్తేనే తాను వెళతానని ఆయన మొరాయించి కూర్చునట్లు తెలుస్తోంది. కాగా, తెలంగాణకు ప్రతినిధిగా మోత్కుపల్లి నర్సింహులును ఎంపిక చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాగా, చంద్రబాబును ఖాతరు చేయకుండా ఒక వైపు తెలంగాణ నాయకులు, మరో వైపు సీమాంధ్ర నాయకులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉందని, ఆ విషాయన్నే తాము ఢిల్లీలో వినిపిస్తామని తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావు ఢిల్లీకి బయలుదేరే ముందు అన్నారు. కాసేపట్లో పోలిట్ బ్యూరో సమావేశం జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications