నేను దారిన పోయే దానయ్యను: ముఖ్యమంత్రి

Rosaiah
న్యూఢిల్లీ: తెలంగాణపై తాను దారిన పోయే దానయ్యనని, ఆ విషయంపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని అడగాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. అయితే ఆ తర్వాత కాస్తా సర్దుకుని రాష్ట్ర విభజనకు రేపటి సమావేశంతో శాంతియుత పరిష్కారం లభించగలదని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర నాయకత్వానికి వివరిస్తానని ఆయన అన్నారు. రేపటి సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన ఆయన సోమవారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించి మార్దదర్శకాలు ఎలా ఉండాలనే విషయంపై సమావేశంలో చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. అఖిల పక్ష భేటీకి మాత్రమే తాను వచ్చానని, ఇప్పుడేమీ మాట్లాడబోనని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రిగా తాను సమావేశంలో పాల్గొంటానని, తనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానమేనని ఆయన అన్నారు. తెలంగాణలో ఆందోళనల విషయంలో ఒక రకంగా, సీమాంధ్రల్లో ఆందోళనల సందర్భంగా మరో రకంగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుంటుపడడంపై కేంద్ర నాయకత్వానికి వివరిస్తానని ఆయన అన్నారు. ఐటి, ఇతర పరిశ్రమలకు ఇబ్బందులు కలుగుతున్న విషయం వాస్తవమేనని ఆయన అన్నారు. అన్ని పార్టీల అభిప్రాయం వినడానికి తాను ఢిల్లీ వచ్చినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+