వెనుకబడిన ఉత్తరాంధ్రకు ప్యాకేజి కోసం డిమాండ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని తెలంగాణవాదులు ఓవైపు పోరాటం చేస్తున్నారని, అయితే అన్ని రంగాల్లో వెనుకబడి వున్న ఉత్తరాంధ్ర గురించి ప్రధాన రాజకీయ పార్టీలు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్ర ప్రకృతి వనరులపై ఉత్తరాంధ్ర ప్రజలకే సర్వహక్కులూ ఉండాలన్నారు. ఈ ప్రాంతాలలో రసాయన కాలుష్యం కలిగించే పరిశ్రమలు నిలిపివేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎస్.గోపాల్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కేవలం 13 జిల్లాలకేనా, లేదా 23 జిల్లాలకు ఉందా అని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర ప్రజల హక్కులు, బాధలు, కన్నీటీ గాథలు వినాలన్నారు. నిజానికి తెలంగాణ కంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు పీవీ చలపతిరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఉద్యమాలకు సాహితీ సాంస్కృతిక సంపదకు నిలయమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజా హక్కుల పోరాట వేదిక కన్వీనర్ గంటా పాపారావు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని భూములన్నింటిపైనా ఉత్తరాంధ్రులకే హక్కులు కల్పించాలన్నారు. ఉత్తరాంద్ర కేంద్రమైన విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయలన్నారు.












Click it and Unblock the Notifications