వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాళ్ళరేవులో రోశయ్య సభకు భారీగా మహిళల సమీకరణ

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
రాజమండ్రి: ఈ నెల ఆరున తాళ్లరేవు మండలంలో జరగనున్న ముఖ్యమంత్రి కె.రోశయ్య పర్యటనకు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ జరిగే తాళ్లరేవు ఉన్నత పాఠశాల ఆవరణలో జరుగుతు న్న ఏర్పాట్లను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌, పలువురు అధికారులు ఆదివారం పరిశీలించి, స్థానిక నాయకులతో చర్చించారు. సీఎం బహిరంగ సభకు సుమారు 50 వేల మంది జనాన్ని సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ జరిగే కార్యక్రమం డ్వాక్రా మహిళలది కావటంతో వారిని ఎక్కువగా బహిరంగసభకు ర ప్పించడంపై నాయకులు దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ నాయకులు జి.త్రినాథ్‌, వి.భాస్కరరాజు, పి.వర్మరాజు,గంజా సూరి బాబు, కాశి లకణస్వామి, దడాల బుజ్జిబాబు, గోడి భాస్కరరావు,చిట్టూరి చలపతి పాల్గొన్నారు.

సీఎం రోశయ్య బహిరంగ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లలో ఆదివారం చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానిక జెడ్పీ పాఠశా ల గ్రౌండ్‌లో టెంట్లు వేయడానికి తాళ్ల సహాయంతో టవర్లు ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు స్కూటర్‌ డ్రైవింగ్‌ నేర్చుకుంటూ తాళ్లను ఢీకొట్టారు. దాంతో తాళ్లు తెగి ఇనుపటవర్లు పక్కనే ఉన్న విద్యుత్‌ వైర్లపై పడ్డా యి. అప్పటికి టవర్లపై ఇద్దరు యువకులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా విద్యు త్‌ వైర్ల నుంచి పెద్ద శబ్దం, మంటలు రావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులయ్యారు. విద్యుత్‌ శాఖ సిబ్బంది అప్రమత్తమై సరఫరాను వెంటనే నిలిపివేయడంతో టవర్‌పై ఉన్న ఇద్దరు యువకులు త్రుటిలో ప్రమాదం నుంచి బయట పడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X