ఢిల్లీకి క్యూ కట్టిన రాజకీయ నేతలు

కాగా, ముఖ్యమంత్రి కె. రోశయ్య సోమవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ రోజంతా అధిష్టానానికి చెందిన వివిధ నాయకులతో చర్చలు జరుపుతారు. ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, చిదంబరం వంటి నాయకులతో ఆయన భేటీ అవుతారు. శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెసు శాసనసభ్యులు కూడా వరుసగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ప్రజారాజ్యం తరఫున చిరంజీవి, సి. రామచంద్రయ్య ఢిల్లీ వెళ్లనున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇప్పటి వరకు తన ప్రతినిధులను ఖరారు చేయలేదు.












Click it and Unblock the Notifications