ఢిల్లీలో చిరంజీవికి తెలంగాణ చెక్?

చిరంజీవి ఓటర్లకు ఇచ్చిన హామీని, పార్టీ నిర్ణయాన్ని మార్చుకున్నారని, అది సమంజసం కాదని వారంటున్నారు. ఈ స్థితిలో రేపటి సమావేశంలో తెలంగాణవాదానికి ప్రాతినిధ్యం లేకుండా చిరంజీవి చేస్తున్నారని, అందువల్ల రేపటి సమావేశంలో తమకు కూడా అవకాశం కల్పించాలని ఆ ఇద్దరు శాసనసభ్యులు కోరుతున్నారు. చిదంబరానికి వారు ఓ లేఖ రాశారు. చిదంబరాన్ని కలిసేందుకు వారు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే వారు కేంద్ర హోం శాఖ కార్యదర్శి పిళ్లైను కలిసినట్లు తెలుస్తోంది. చిరంజీవి వైఖరిని తెలంగాణ నాయకులు తీవ్రంగా దుయ్యబడుతున్నారు.












Click it and Unblock the Notifications