అపోహలు తొలగించేందుకే సమావేశం: చిదంబరం

రాజకీయ పార్టీలన్నీ 2009 ఎన్నికల ప్రణాళికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై తాము తొందరపడి ప్రకటన చేయలేదని, అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాతనే ప్రకటన చేశామని, రాజకీయ పార్టీలు మరో అడుగు ముందుకు వేస్తే సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. ఆందోళనల్లో అసాంఘిక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని, అలాంటి పరిస్థితి రాకూడదంటే రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆందోళనలు ఆపాలని, అన్ని పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమస్య పరిష్కారానికి కేంద్రంతో సహకరించాలని ఆయన అన్నారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా రాజకీయ పార్టీలు వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు.












Click it and Unblock the Notifications