తెలంగాణపై కాల పరిమితికి చిదంబరం నో?

Chidambaram
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియకు నిర్దిష్ట కాలపరిమితిని పెట్టడానికి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం నిరాకరించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు నిర్దిష్ట కాల పరిమితి విధించాలని వచ్చిన సూచనకు చిదంబరం ప్రతిస్పందిస్తూ అది సాధ్యం కాదని తెలిపినట్లు సమాచారం. హేతుబద్దమైన సమయంలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన మంగళవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుకుండానే చిదంబరం, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య వెళ్లిపోయారు. అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని హోం శాఖ తెలిపింది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో మాట్లాడిన తర్వాతనే ప్రకటన చేస్తామని చిబందరం చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా, కమిటీ ఏర్పాటు ప్రతిపాదనకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వ్యతిరేకించినట్లు సమాచారం. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వెంటనే ప్రకటించాలని బిజెపి డిమాండ్ చేసింది. రాష్ట్రంలో శాంతి పరిస్థితులు నెలకొన్న తర్వాత తదుపరి చర్చలు, నిర్ణయాలు జరుగుతాయని కాంగ్రెసు తెలంగాణ ప్రతినిధి ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పరిస్థితులను వివరించామని కాంగ్రెసు సీమాంధ్ర ప్రతినిధి కావూరి సాంబశివ రావుచెప్పారు. తమ వాదనలు సమావేశంలో వివరించామని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. కేంద్రం ప్రకటన తర్వాత ప్రతిస్పందిస్తామని కెసిఆర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

తమ అభిప్రాయం చెప్పామని తెలుగుదేశం ప్రతినిధులు చెప్పారు. నిర్దిష్ట కాల పరిమితి విధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని కోరినట్లు టిడిపి తెలంగాణ ప్రతినిధి రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పారు. సమావేశంలో సమైక్యవాదులుతమ వాదనను గట్టిగా వినిపించలేదని సమాచారం. విస్తృత ప్రాతిపదికపై చర్చలు అవసరమని కొన్ని పార్టీలు చెప్పాయని కావూరి సాంబశివ రావు చెప్పారు. తమ పార్టీ తరఫున ఉన్న పరిస్థితులను చెప్పామని ఆయన అన్నారు. కాగా, ఈ సమావేశం తర్వాత కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉంది. కోర్ కమిటీలో సమావేశం చర్చలపై విస్తృతంగా చర్చించి ఒక నిర్ణయాన్ని చిదంబరం వెల్లడించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+