స్పష్టమైన ప్రకటన రాలేదు: చిరంజీవి

Chiranjeevi
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర హోం మంత్రి చిదంబరం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చెప్పారు. తమ అభిప్రాయాలు వినడానికి మాత్రమే పరిమితమయ్యారని ఆయన అఖిల పక్ష సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. చర్చలు సజావుగా సాగాయని, తాము సంతృప్తిగా ఉన్నామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అంశంపై కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రబుత్వం కమిటీ వేస్తుందనే నమ్మకం తమకు ఉందని, తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, శాంతిభద్రతల పరిస్థితి బాగా లేదని, పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని ఆయన అన్నారు. చొరవ చూపి కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఆయన అన్నారు. చిదంబరం అభిప్రాయ సేకరణకు మాత్రమే పరిమితమయ్యారని ఆయన చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం సేకరించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చిదంబరం చెప్పినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మాత్రమే నిర్దిష్టమైన వైఖరితో లేవని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+