చర్చల పూర్తికి కాల పరిమితి: చిదంబరం

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చర్చల ప్రక్రియను పూర్తి చేయడానికి కాల పరిమితి విధించేందుకు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సుముఖత వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితిని విధించడానికి నిరాకరించిన ఆయన సంప్రదింపులను పూర్తి చేయడానికి మాత్రం కాల పరిమితిని విధించడానికి అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అఖిల పక్ష సమావేశానంతరం ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ పై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయని, పార్టీల వ్యక్తిగత అభిప్రాయాలపై తాను మాట్లాడబోనని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఒక అవగాహనకు రావడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర విభజన విషయంలో ప్రభుత్వ వైఖరిని తాను వెల్లడించలేనని, సమావేశం సారాంశాన్ని తాను ప్రభుత్వానికి వివరిస్తానని ఆయన చెప్పారు. తదుపరి చర్చలకు ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదని, మళ్లీ చర్చలు కావాలని కూడా అడగలేదని ఆయన చెప్పారు. సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని, అన్ని వర్గాలతో చర్చలు జరుపుతామని ఆయన చెప్పారు. కేంద్రంలోని పెద్దలతో మాట్లాడని తర్వాత ఒక ప్రకటన విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆయన అన్నారు. విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోవద్దని ఆయన అన్నారు. తగిన సమయంలో సంప్రదింపుల ప్రక్రియ మొదలవుతుందని ఆయన చెప్పారు. సమస్య పరిష్కారానికి తగిన సమయం ఇస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+