రెండు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆందోళనలు

తెలంగాణ అంతటా ఆందోళనలు సాగుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. వరంగల్లు, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో రైళ్లను ఆపేశారు. హైదరాబాదులోని ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ జెఎసి నేత శ్రీహరిని నల్లగొండ జిల్లా కోదాడలో పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జెఎసి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులో రాస్తారోకో నిర్వహించారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఉస్మానియాలోకి పోలీసులు మీడియాను అనుమతించడం లేదు. హైదరాబాద్ పరిసరాల్లో రాస్తారోకోలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఎడ్లబండ్ల ప్రదర్శన జరిగింది.












Click it and Unblock the Notifications