సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు

ఆర్టీసీ అధీకృత ఏజెంట్స్ (ఏబీటీ) వద్ద, ఈ-బుకింగ్ ద్వారా కూడా రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు. రాజధాని నుంచి విజయవాడకు 1450, గుంటూరుకు 495, పశ్చిమగోదావరికి 140, తూర్పుగోదావరికి 130, విశాఖపట్నంకు 75, ఒంగోలుకు 455, నెల్లూరుకు 80, కర్నూలుకు 310, కడపకు 85, అనంతపురంకు 85, తిరుపతికి 60, ఖమ్మంకు 195, వరంగల్‌కు 230 మెదక్‌కు 230 బస్సు సర్వీసులు నడుస్తాయని తెలిపా రు. ప్రయాణీకుల రద్దీని బట్టి అవసరమైతే అప్పటికప్పుడు అదనపు బస్సులను ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఏపీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఏటీఎం శ్రీనివాసరావు, డిప్యూటీ సీటీఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications