ప్రాంతాలుగా విడిపోదాం: కోదండరామ్

ప్రజాస్వామికంగా అభివృద్ధి జరగాలని, అందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామని ఆయన సీమాంధ్ర నేతలకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విభజనకు సహకరించాలని, చర్చలు జరుపుకుందామని ఆయన అన్నారు. సమైక్యవాదులు హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన సోమవారం స్పష్టం చేశారు. సమైక్యవాదుల సమావేశాన్ని అడ్డుకుంటామని విద్యార్థుల జెఎసి హెచ్చరించిన నేపథ్యంలో ఆయన ఆ విధంగా చెప్పారు.












Click it and Unblock the Notifications