చిదంబరం మమ్మల్ని అవమానించారు: నాగం జనార్దన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణలో ఏకాభిప్రాయం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇంకా జాప్యం చేస్తే రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య మరింతగా వైషమ్యాలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేసి కాలపరిమితి విధించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం గానీ కాంగ్రెసు పార్టీ గానీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. సంప్రదింపుల పేరుతో కాలయాపన చేయడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications