వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు కొనసాగిస్తాం: రోశయ్య

Rosaiah
రాజమండ్రి: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో జరిగిన సభలో ఆయన బుధవారం మాట్లాడారు. పేదలకు, మహిళలకు వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, తద్వారా వైయస్ వారి గుండెల్లో నిలిచిపోయారని ఆయన అన్నారు. మహిళలు పొదుపు పాటించడాన్ని ప్రోత్సహించిన ఘనత వైయస్ కే దక్కుతుందని ఆయన అన్నారు.

తెల్ల రేషన్ కార్డుపై బియ్యం, కందిపప్పు, కిరోసిన్ చౌక ధరలకు అందించడమే కాకుండా తెల్లరేషన్ కార్డు హోల్డర్లకు ఆరోగ్యశ్రీని వర్తింపజేసింది కూడా వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన అన్నారు. తీవ్రమైన వ్యాధులకు గురైనప్పుడు పేదలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందని ఆయన అన్నారు. వైయస్ జన్మతా ఉదార స్వభావి అని ఆయన అన్నారు. వైయస్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసుకుంటూ పోవడంమే తాము చేయాల్సిన పని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+