తెలంగాణ జెఎసిలో విభేదాలు

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామాలు సమర్పించి వాటిని ఆమోదింపజేసుకుని ఉద్యమంలోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి తెలుగుదేశం నాయకులతో పాటు కాంగ్రెసు నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డికి, మందకృష్ణకు మధ్య వాగ్వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. మందకృష్ణ మాదిగ తీరును తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. మందకృష్ణ మాదిగ పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని తప్పు పట్టారు. వారికి ఇతరులు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. రాజీనామాల ఆమోదానికి స్పీకర్ పై ఒత్తిడి తేవాలని జెఎసిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications