రాజీనామాల ఆమోదానికి పట్టు: కె చంద్రశేఖర రావు

సంక్రాంతి పర్వదినం తర్వాత పార్టీ నాయకులంతా జిల్లాల్లో పర్యటించి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులను కోరుతూ మరో తీర్మానం చేసినట్లు ఆయన చెప్పారు. ఉద్వేగానికి, మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విద్యార్థులను కోరారు. పోరాటంలో భాగస్వాములు కావాలి తప్ప ప్రాణాలు తీసుకోవద్దని ఆయన అన్నారు. ప్రాణాలు ఇవ్వడానికి తాము ముందు వరుసలో ఉంటామని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమ ప్రతిపాదనలను రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి ముందుంచుతామని ఆయన చెప్పారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications