సిబిఐకి సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసు: సుప్రీం

సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులు సస్పెండ్ అయిన డిఐజి డిజి బంజారా, ఆర్ కె పాండియన్, దీనేష్ ఎంఎన్ ప్రధాన నిందితులు. గుజరాత్ డిఎస్పీ ఎన్ కె అమీన్ కూడా నిందితుడు. వారంతా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి బస్సులో వెళ్తుండగా 2005 నవంబర్ 22వ తేదీన గుజరాత్, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా సోహ్రాబుద్దీన్ ను, ఆయన భార్య కౌసర్ బీని, మరో వ్యక్తిని పట్టుకున్నట్లు సమాచారం. సోహ్రాబుద్దీన్ ను గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం కాల్చి చంపినట్లు ఆరోపణలున్నాయి. సోహ్రాబుద్దీన్ భార్య కౌసర్ బీని, మరో వ్యక్తి తుల్సీ రామ్ ప్రజాపతిని కూడా గుజరాత్ పోలీసులు కాల్పి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications