వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరు జిల్లాలో ప్రవాసాంధ్రుల 'సమైక్య' ధూమ్ ధామ్

By Santaram
|
Google Oneindia TeluguNews

Guntur Dist
గుంటూరు: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గ్రామ గ్రామాలకు తీసుకెళ్ళేందుకు ప్రవాసాంద్రులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రవాస భారతీయులు గోగినేని వాసు, సూదిరెడ్డి అనిల్‌వాసు, గోగినేని కల్యాణ్‌ల ఆధ్వర్యంలో వట్టిచెరుకూరు మండ లం ముట్లూరులో వారం రోజుల పా టు పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

ఈ మేరకు ఈనెల 18న ఎన్టీ ఆర్‌ వర్థంతి సందర్భంగా తెలుగువారి ఆత్మగౌరవ సభ పేరుతో ధూంధాం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగువారి ఆత్మగౌరవ సభ పేరుతో ముద్రించిన వాల్‌ పోస్టర్లను సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌, పార్టీ నేతలు మాదల రాజేంద్ర, కేశన శంకరరావు, కందుకూరి వీరయ్య తదితరులు ఆవిష్కరించారు.

ఈనెల 12న వివేకానంద జయంతిని పురస్కరించుకొని ముట్లూరులో తొమ్మిది గంటలకు హోమం, మూడు గంటలకు యువజనోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 13న వివేకానంద యూత్‌ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. 15న తెలుగువారి ఆత్మగౌరవ సభను ఉద్దేశించి ప్రజలలో జాగృతి తీసుకొచ్చేందుకు గుంటూరు నుంచి 150 సైకిళ్ళతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. 16న ముట్లూ రులో కాగడాల ప్రదర్శన ఏర్పాటు చేశారు.

17న ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మం డలాల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు అనువుగా మెగా క్యాన్సర్‌ క్యాంపును నిర్వహిస్తున్నారు. ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 18న ఎన్టీ ఆర్‌ వర్థంతిని పురస్కరించుకొని తెలుగువారి ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోజు రెండు గంటలకు పంచామృతంతో ఎన్టీ ఆర్‌కు అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర కుమార్‌ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ జైళ్లు, నడి వీధులలో నిలబెట్టిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కిందన్నారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత స్వర్గీయ ఎన్టీ ఆర్‌కు దక్కిందన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం చంద్రబాబు నిర్విరామంగా కృషి చేశారన్నారు. గుంటూరు పార్లమెంట్‌ దేశం ఇన్‌చార్జి మాదల రాజేంద్ర మాట్లాడుతూ ర్రాష్టాన్ని విడదీయడమంటే అన్నదమ్ములను విడదీయడమేనన్నా రు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X