తెలంగాణపై ఏదైనా జెఎసితోనే: ఆర్ దామోదర్ రెడ్డి

జెఎసిలో అందరికన్నా బలంగా తాము తెలంగాణ వాదాన్ని వినిపిస్తామని ఆయన చెప్పారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి. శ్రీధర్ బాబు ఎందుకు రాజీనామాలు ఉపసంహరించుకున్నారో తమకు తెలియదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎజెండాను రూపొందించుకోవడం తప్ప తాము మరో విషయం గురించి ఆలోచించడం లేదని ఆయన అన్నారు. తమలో విభేదాలు లేవని, తామంతా ఒక్కటేనని ఆయన అన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించడమైనా, మరేదైనా తాము జెఎసి నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications