18న కెసిఆర్ బస్సు యాత్ర మేడారం నుంచి ప్రారంభం?

K Chandrasekhar Rao
వరంగల్: టీఅర్ ఎస్ అధినేత కేసీఆర్‌ చేపట్టే 'ప్రజల్లోకి కేసీఆర్‌' అన్న యాత్ర మేడారం నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయని టీఆర్‌ ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్య మిస్తున్న ప్రజాసంఘాల్లో మరింత ఆ త్మస్థైర్యం పెంచాలని టీఆర్‌ ఎస్‌ నిర్ణయించింది. అందులో భాగంగా ఈనె ల18నుంచి తెలంగాణలో బస్సు యాత్ర చేయాలని ఆ పార్టీ మంగళవారం జరిగిన పార్టీ పొలిట్‌ బ్యూరో తీర్మానిం చింది.

ఈనెల 27నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతర సందర్భంలో కేసీఆర్‌ సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడం భద్రతా కారణాల దృష్ట్యా, సరైందని కాదని జాతర ప్రారంభానికి కంటే ముందే కేసీఆర్‌ మేడారం వచ్చే అవకాశాలున్నాయని పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు. ఆయన మేడారం పర్యటన వివరాలను ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామని ఆ నాయకుడు పేర్కొన్నారు.

తెలంగాణ విషయంలో ఈనెల 5న కేంద్ర హోంమంత్రి చిదంబరం నిర్వహించిన పార్టీల సమావేశం అనంతరం అన్నిపార్టీలు ప్రత్యక్ష్యం గానో, పరోక్ష్యంగానో తమతమ అభిప్రాయాలు వెల్లడించాయి. టీఆర్‌ ఎస్‌ అధినేత కేసీఆర్‌ వారం రోజులు ఢిల్లీలోనే లాబీయింగ్‌ నిర్వహించి, వ్యూహాత్మక మౌనం పాటించారు. తెలంగాణ వాదుల్లో పార్టీ అనుసరిస్తోన్న వైఖరిపట్ల విమర్శలు, అనుమానాలు వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో 'మౌనం' వీడి వాస్తవాలు ప్రజలకు వెల్లడించాల్సిన అనివార్యతలు ఏర్పడ్డ నేపథ్యంలో స్వయంగా పార్టీ అధినేత ప్రజల్లోకి రావాలని పోలిట్‌ బ్యూరో తీర్మానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+