హైతీలో భారీ భూకంపం కూలిన భవనాలు

చాలా మంది ఐక్య రాజ్య సమితి అధికారుల జాడ తెలియడం లేదని అధికార వర్గాలు చెప్పాయి. ఏ మేరకు నష్టం ఉంటుదనేది కూడా అంచనాకు అందడం లేదు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ లేకుండా పోయింది. వేల మంది మరణించి ఉంటారని కాథలిక్ రిలీఫ్ ప్రతినిధి కరేల్ జెలెంకా చెప్పారు. నగరంలో దుమ్ము అలుముకుని ఏమీ కనిపించని స్థితి నెలకొందని ఆయన చెప్పారు. వీధుల్లో మృతదేహాలు పడి ఉన్నట్లు కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications