సూరి అవసరం కాంగ్రెస్ కు లేదు: రాప్తాడు నేతలు

సూరి రాప్తాడు నియోజకవర్గంలో క్రియాశీలకం కావాలనుకోవడం స్ధానిక కాంగ్రెస్ నాయకులకు రుచించడం లేదు. ఇటీవల జైలు నుంచి విడుదలైన మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి అండ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చందూ పేర్కొన్నారు. బుధవారం అనంతపురంలోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమా వేశంలో వారు మాట్లాడుతూ సూరికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేదనిఎద్దేవా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అండ సూరికి అవసరమే కానీ ఆయన అండ పార్టీకి ఏమాత్రం అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ అభివృద్ధి వైపు చూస్తున్నా రు కానీ ఫ్యాక్షనిస్టుల అరాచకాల వైపు కాదన్నారు.
తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలో పరిటాల రవీంద్ర చేసిన అరాచక చర్యలను కాదని 2009 ఎన్నికల్లో రాప్తాడు నియోజ కవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో శాంతిని నెలకొల్పాలన్న ఆశయంతో రాహుల్ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు ఆధ్వ ర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. మద్దెలచెరువు సూరి చెప్పినట్టు ఆయన వద్దంటే రాప్తాడు నియోజకవర్గ స్థానాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తమకు కేటాయించలేదని, తాము చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చూసి రాప్తాడు స్థానాన్ని తమకు కేటాయించారన్నారు.












Click it and Unblock the Notifications