న్యూఢిల్లీ: మంచు దుప్పటి కప్పడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలకు శుక్రవారం ఉదయం అంతరాయం కలిగింది. దాదాపు 15 విమానాల రాకపోకల సమయాలు దెబ్బ తిన్నాయి. 14 విమానాలు మూడు గంటల పాటు ఆలస్యంగా బయలుదేరగా, ముంబైకి వెళ్లాల్సిన జెట్ లైట్ విమానం రద్దయింది.
రెండు రన్ వేల్లోనూ కంటి చూపు 150 నుంచి 275 మీటర్ల మేర ఆనలేదు. క్యాట్ - 3 బి వాడి ల్యాండింగ్ సౌకర్యం కల్పించారు. ఐజిఐ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) గురువారం సాయంత్రం దెబ్బ తిన్నది. దీంతో విమానాల రాకపోకల్లో రెండు గంటల పాటు ఆలస్యమైంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి