రాజీనామాల ఉపసంపరణ కుట్రే: యాష్కీ

ప్రజాప్రతినిధులు రాజీనామాలు ఉపసంహరించుకోవాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క చేసిన సూచనను తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ కోదండరామ్ ఖండించారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన కోసం తాము డిమాండ్ చేస్తున్నామని, ఆ స్పష్టమైన వ్రకటనను వారు తెస్తే రాజీనామాల ఉపసంహరణకు అభ్యంతరమేమీ లేదని ఆయన శుక్రవారం హైదరాబాదులోని మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాలపరిమితితో కూడిన కార్యక్రమానికి సంబంధించి స్పష్టమైన ప్రకటన తప్ప తమకేమీ అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications