తెలంగాణపై 28 తర్వాతే కేంద్రం దృష్టి

కోర్ కమటీ సమావేశంలో సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్, అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం పాల్గొన్నారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధుల చేత రాజీనామాలు ఉపసంహరింపజేసే ఎత్తుగడలో ఉన్న కాంగ్రెసు అధిష్టానం ఈలోగా ఎంత మంది దిగి వస్తారో చూడాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. అయితే కోర్ కమిటీలో కొత్త గవర్నర్ల నియామకంపై చర్చ చేసింది. జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్ పశ్చిమ బెంగాల్ కు గవర్నర్ గా పంపాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ తో సహా ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే విషయంపై చర్చ జరిగింది. కొత్త గవర్నర్ల నియామకంపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన రావచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications