తెలంగాణలో దానం నాగేందర్ కు చేదు అనుభవం

మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం గణేష్ పూర్ గ్రామంలో ఆందోళనకారులు దానం నాగేందర్ కారుపై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. అన్ని పార్టీలను సంప్రదించి హైదరాబాదులో శాంతి ర్యాలీ నిర్వహిస్తానని ఆయన నల్లగొండ జిల్లాలో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే బిసిలకు అధికారం అప్పగించాలని ఆయన కోరారు. అదుర్స్ సినిమాను అడ్డుకోవాలనే తెలంగాణ ఆందోళనకారులను నాగేందర్ తీవ్రంగా వ్యతిరేకించారు. హైదరాబాదులో శాంతిర్యాలీ నిర్వహిస్తానంటూ తెలంగాణవాదులపై ఆయన విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications