తెలంగాణ జెఎసి రిలే దీక్షలు ప్రారంభం

తమ కాంగ్రెసు పార్టీ ఈ నెల 28వ తేదీ లోపు తెలంగాణపై ప్రకటన చేయదని వస్తున్న వార్తల్లో నిజం లేదని, వివిధ పత్రికల్లో వేర్వేరుగా వార్తలు వస్తాయని, అందువల్ల 28 లోపు తమ అధిష్టానం ప్రకటన చేయదని వస్తున్న వార్తల్లో నిజం లేదని అర్థమవుతోందని ఆర్ దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇస్తారో, ఇవ్వరో స్పష్టంగా చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేశారంటూ తెలంగాణ జన జాగృతి నాయకురాలు కవితపై కేసు పెట్టిన పోలీసులు సినీ నటుడు మోహన్ బాబుపై ఎందుకు పెట్టరని ఆయన ప్రశ్నించారు. పలు ప్రజా సంఘాల ప్రతినిధులు రిలే దీక్షలకు కూర్చున్న నేతలకు సంఘీభావం తెలపడానికి వస్తున్నారు.












Click it and Unblock the Notifications