19న హైదరాబాదులో సీమాంధ్ర భేటీ

Devineni Umamaheswara Rao
విజయవాడ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనకు ఈ నెల 19వ తేదీన సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల సమావేశం జురుగనుంది. తెలుగుదేశం నాయకుడు దేవినేని ఉమా మహేశ్వర రావు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణ నాయకులు పండుగ కాలక్షేపం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చాలా సమయం ఉంది కాబట్టి తాము ఆందోళనలు చేపట్టడం లేదని ఆయన చెప్పారు.

ఏ ప్రాంతం విద్యార్థుల పరీక్ష పత్రాలను ఆ ప్రాంతంలోనే దిద్దాలనే తెలంగాణ నాయకుల డిమాండ్ ను ఆయన వ్యతిరేకించారు. విద్యార్థుల్లో లేనిపోని అపోహలను కల్పించడానికి తెలంగాణ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక నాయకుడేమో రాజ్యాంగ సంక్షోభం అంటారని, మరో నాయకుడు మరోటి అంటాడని ఆయన తెలంగాణ నాయకులను ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+