తెలంగాణపై తేల్చాల్సింది కేంద్రమే: రోశయ్య

కేంద్రం విడుదల చేసిన పంటల బీమాలో తెలంగాణ వాటాపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. తెలంగాణకు తక్కువ నిధులు కేటాయించారని తెలంగాణకు చెందిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి, శ్రీధర్ బాబు వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డిని ప్రశ్నించారు. నిబంధల ప్రకారమే నిధుల కేటాయింపు జరిగిందని మంత్రి సమాధానమిచ్చారు. ఉపాధి హామీ పథకంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందని మంత్రి జె. గీతారెడ్డి చెప్పారు. సంక్షేమ పథకాల తీరుతెన్నులపై కూడా మంత్రివర్గం చర్చించింది. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇఐస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మార్క్సిస్టు నేత జ్యోతిబసు మృతికి మంత్రి వర్గం సంతాపం ప్రకటించింది.












Click it and Unblock the Notifications