చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా 16 ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్..!!

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా 16 ప్రత్యేక రైళ్లను ఖరారు చేస్తూ ప్రకటించారు. ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా ఈ రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైళ్ల రూట్.. షెడ్యూల్ ఖరారు చేసారు. వీటిలో ప్రయాణం కోసం ముందస్తు రిజర్వేషన్ ప్రారంభించారు. ఈ రైళ్ల ద్వారా చర్లపల్లి నుంచి ఏపీ ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది.

రైల్వే శాఖ కాలక ప్రకటన చేసింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి - షాలిమార్ వీక్లీ స్పెషల్ ట్రైన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 26 వరకు చర్లపల్లి - షాలిమార్ మధ్య మొత్తం 16 ప్రత్యేక రైళ్లను నడపాలని డిసైడ్ అయ్యారు. ఆషాడ ఏకాదశి పర్వదినం సందర్భంగా మరికొన్ని రైళ్లను ప్రత్యేకంగా నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు ప్రత్యేక నాందేడ్, నాగర్​సోల్ నుంచి పండరీపూర్ వరకు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ రూట్ లో ఆరు రైళ్లు కేటాయించారు. ట్రైన్ నంబర్ 08046 చర్లపల్లి టు షాలిమార్ శనివారం ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 26 వరకు (8 సర్వీసులు) నడవనుంది. అదే విధంగా ట్రైన్ నంబర్ 08045 షాలిమార్ టు చర్లపల్లి శుక్రవారం ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 25 వరకు (8 సర్వీసులు) ఉంటాయని వెల్లడించారు.

railways-announces-16-special-trains-for-passengers-between-charlaplli-and-shalimar-in-next-month

చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

కాగా.. నంబర్ 08046/45 చర్లపల్లి - షాలిమార్ - చర్లపల్లి వీక్లీ స్పెషల్ ట్రైన్లు విజయవాడ జంక్షన్ వెళ్లకుండానే రాయనపూడి నుంచి ఏలూరు స్టేషన్ చేరుకుంటాయి. ఈ రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మ, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని,దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపుర్, కుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జైపూర్, భద్రక్, బాలాసోర్, ఖరగ్పూర్, సంత్రగచ్చి స్టేషన్లలో ఆగనున్నాయి. అదే విధంగా నాందేడ్, నాగర్​సోల్ - పండరీపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. నంబర్ 07645 నాందేడ్ - పండరీపూర్ మధ్య ఈ నెల 26, ఆగస్టు 2వ తేదీల్లో ప్రయాణిస్తుంది. కాగా, నంబర్ 07646 పండరీపూర్ - నాందేడ్ మధ్య ఈ నెల 27, ఆగస్టు 3వ తేదీల్లో అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+