గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారా, వీరికి మాత్రం..!?
గోరెవెచ్చని నిటిలో తేనె, నిమ్మరసం. ఇలా తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతీ రోజు ఉదయం పరగడపున ఇలా తాగటం వలన మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. నిమ్మరసంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే చాలా మంది ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడానికి ఇష్టపడతారు. దీని ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాగా.. ఇలా తీసుకోవటం పైన నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది పరగడపున ఇలా తేనె, నిమ్మరసం కలిపిన నీరు తీసుకోవటం అలవాటుగా మార్చుకున్నారు. దీని వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బరువును తగ్గించడం కోసం ఈ నీళ్లు ఎంతగానో పనిచేస్తాయి. అయితే కొందరు ఈ నీటిలో తేనెకు బదులుగా చక్కెర కలిపి తాగుతుంటారు. బరువు తగ్గాలని చూస్తున్నవారు ఎట్టి పరిస్థితిలోనూ నిమ్మకాయ నీళ్లలో చక్కెర కలపకూడదు. ఉప్పును కూడా కలపకూడదు. ఎండవల్ల మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడితేనే అలాంటి సందర్భంలోనే నిమ్మకాయ నీళ్లలో ఉప్పు, చక్కెర కలిపి తాగాలి. రోజుకు 1 లేదా 2 సార్లు తాగాలని మాత్రమే నియమం పెట్టుకోవాలి. అన్నే సార్లు తాగాలి. లేదంటే శరీరంపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. నిమ్మకాయ నీళ్లను తయారు చేసేందుకు ఉపయోగించే నీళ్లు చాలా శుభ్రంగా ఉండాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మకాయ నీరు తాగడం ద్వారా శరీర హైడ్రేషన్ బాగా ఉంటుంది.

నిపుణుల సూచనలు
కాగా, ఈ జ్యూస్ ను పరగడుపున తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి ప్రేరేపించబడటంతో రోజంతా తీసుకునే ఆహారాన్ని జీర్ణ చేయడంలో సహాయపడుతుంది. ఇలా రోజు ఈ జ్యూస్ తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిమ్మకాయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని చెప్పి కొందరు నేరుగా నిమ్మరసాన్ని సేవిస్తుూ ఉంటారు. ఇలా చేయటం సరైన విధానం కాదు. నిమ్మకాయ రసంలో ఆమ్ల గుణాలు ఉంటాయి. ఇవి దంతాలకు నేరుగా తాకితే దంతాలపై ఉండే ఎనామిల్ పొర కరిగిపోతుంది. దీంతో దంతాలు బలహీనంగా మారుతాయి. గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నవారు ఈ నీళ్లను ఎట్టి పరిస్థితిలోనూ పరగడుపున సేవించకూడదు. ఈ నీళ్లను తాగాలని భావిస్తే ఉదయం అల్పాహారం చేసిన తరువాత 40 నిమిషాలు ఆగి ఆ తరువాత తాగవచ్చు. ప్రతీ రోజు నిర్దేశించిన సమయంలో పరమితి మేరకు ఈ నీరు తాగటం ద్వారా ఆరోగ్య పరంగా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications