విజయ్ వీడ్కోలు సినిమా..ఇలా చేశావేంటన్నా..!

కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా ఎదిగి.. తన తొలి ప్రయత్నంలోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దళపతి విజయ్.. చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దళపతి విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఆయన నటించిన చివరి చిత్రం 'జననాయగన్'పై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి.అనేక వివాదాలు, సెన్సార్ వివాదాలు, విడుదలకు ముందు వచ్చిన ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సినిమా ఎట్టకేలకు జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ఈ చిత్రం విడుదల కాక ముందు దళపతి విజయ్ చుట్టూ ఉన్న క్రేజ్, పొలిటికల్ మైలేజ్ దృష్టిలో ఉంచుకుంటే.. సరైన విజన్ ఉన్న దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించే అవకాశం ఉండేది. ఈ క్రేజీ ప్రాజెక్టును హెచ్.వినోద్ చేతిలో పెట్టడంపై విశ్లేషకులలో, అభిమానుల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు సినిమా థియేటర్లలోకి వచ్చిన అనంతరం ఆ సందేహాలే నిజమవుతూ వస్తున్న రివ్యూలు విజయ్ అభిమానుల్లో ఆగ్రహాన్ని రేపుతున్నాయి.

Jananayagan Movie Disaster Talk A Massive Blow to Thalapathy Vijay Farewell Film Details

ఈ సినిమాలో దశాబ్ధం క్రితం నాటి పాతకాలపు సీన్లు, కాలం చెల్లిన కథనం ఉన్నాయని.. ఇది ఓ మూస ధోరణిలో సాగే సాధారణ కమర్షియల్ సినిమా అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో రివ్యూలు రాసుకొస్తున్నారు. విజయ్ ప్రతిష్టకు, ఆయన ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్లుగా ఈ చిత్రం లేదని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రివ్యూలయితే ఏకంగా ఈ చిత్రం చెత్తగా, సహనానికి పరీక్షగా ఉందని చెబుతున్నాయి. వందల కోట్ల భారీ పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్లకు.. అలాగే రాజకీయంగా తన ఇమేజ్ ను మరింత పెంచుకోవాలని భావించిన విజయ్ ప్రతిష్టకు ఈ విధమైన డిజాస్టర్ టాక్ రావడం నిజంగా కోలుకోలేని పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు.

స్టార్ హీరోగా ఎంతో అనుభవం ఉన్న దళపతి విజయ్.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ లేదా వీడ్కోలు సినిమా కోసం ఓ పేలవమైన దర్శకత్వ ఎంపిక వైపు వెళ్లడమే ఇక్కడ అతిపెద్ద పొరపాటుగా కనిపిస్తోంది. సినీ ప్రయాణానికి ముగింపు పలుకుతూ వీడ్కోలు చిత్రం చేస్తున్నప్పుడు.. స్క్రిప్ట్ విషయంలో, టేకింగ్ విషయంలో విజయ్ చాలా జాగ్రత్త పడాల్సి ఉండేది. ఓ అద్భుతమైన కమర్షియల్ హిట్ సినిమాను రీమేక్ చేయడం లేదా దాని ఆధారంగా సినిమా తీయడం తప్పుకాదు. గతంలో విజయ్ రీమేక్ సినిమాలతో సంచలనాలు సృష్టించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అయితే కథను నేటి తరం అభిరుచికి తగ్గట్లుగా తెరకెక్కించే సరైన దర్శకుడిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. సరిగ్గా ఆ విషయంలోనే విజయ్ తప్పుడు అడుగు వేశారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో చివరి సినిమాను వెండితెరపై పండగలా జరుపుకోవాలని.. థియేటర్లలో విజయ్ కు అద్భుతమైన వీడ్కోలు పలకాలని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన కోట్లాది మంది అభిమానులకు ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+