బోర్ వెల్ లో పడిన మహేష్ క్షేమమే

నాలుగు ప్రొక్లెయిన్లతో బోరు బావిని తవ్వుతున్నారు. సింగరేణి రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు కూడా అక్కడే ఉన్నారు. మహేష్ క్షేమంగా ఉన్నట్లు బావిలోకి పంపిన నైట్ విజన్ కెమెరా దృశ్యాల్లో కనిపిస్తోంది. ఆదివారం రాత్రి ఏడు గంటల వరకు బాలుడు ఏడుపులు వినిపించాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications